(Local) Sat, 24 Jul, 2021

ఆదాయపు పన్ను రిటర్నులు స్వల్పంగా తగ్గుముఖం

September 03, 2019,   11:04 AM IST
Share on:
ఆదాయపు పన్ను రిటర్నులు స్వల్పంగా తగ్గుముఖం

దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను రిటర్నులు ఈసారి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే...ఐటీ రిటర్నులు రెండు లక్షల మేర తగ్గినట్టు ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 31తో ముగిసిన గడువు అనంతరం దేశవ్యాప్తంగా 2 కోట్ల 66 లక్షల 63 వేల 743 ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 2 కోట్ల 68 లక్షల పైచిలుకు ఐటీ రిటర్నులు వేర్వేరు విభాగాల్లో దాఖలైనట్టు ఐటీ విభాగం గణాంకాలు చెబుతున్నాయి. మన రాష్ట్రం నుంచి మొత్తం 8 లక్షల 95 వేల 692 ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. దేశంలోనే అత్యధికంగా గుజరాత్‌లో 28 లక్షలు, అత్యల్పంగా లక్షద్వీప్‌లో 2097 ఐటీఆర్ రిటర్నులు ఫైల్‌ అయినట్టు తేలింది.

సంబంధిత వర్గం
వరుస విజయాల కోహ్లి సేన...
వరుస విజయాల కోహ్లి సేన...
ట్రంప్‌ మాజీ వ్యాపార భాగస్వామి అరెస్ట్
ట్రంప్‌ మాజీ వ్యాపార భాగస్వామి అరెస్ట్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.