(Local) Fri, 22 Nov, 2019

తొలిసారి టాప్-10లో బుమ్రా

August 28, 2019,   3:00 PM IST
Share on:
తొలిసారి టాప్-10లో బుమ్రా

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో తనదైన శైలిలో విరుచుకుపడి  భారత్‌కు ఘన విజయాన్ని అందించిన స్టార్‌ పేసర్‌ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రా.. తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని ఏడో స్థానంలో నిలిచాడు. టాప్‌-10లోకి రావడం బుమ్రాకు ఇదే తొలిసారి. వేగంగా 50 వికెట్లు సాధించిన భారత పేసర్‌గా కూడా బుమ్రా ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఇక, బ్యాట్స్‌మెన్‌ జాబితాలో టీమిండియా కెప్టెన్ కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

సంబంధిత వర్గం
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.