(Local) Mon, 09 Dec, 2019

హ్యూస్టన్‌ వర్సిటీలో తమిళ అధ్యయన పీఠం

November 18, 2019,   11:18 AM IST
Share on:
హ్యూస్టన్‌ వర్సిటీలో తమిళ అధ్యయన పీఠం

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం అమెరికాలో అధికారిక పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా  పన్నీర్‌సెల్వం శనివారం హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ డాక్టర్‌ రేణు ఖతార్‌ గ్రేటర్‌ హాస్టన్‌ పార్డనర్‌షిప్‌ అధికారి సూసన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ, అమెరికా పర్యటనలో తాను ప్రవాసభారతీయులు, తమిళులను పెద్ద సంఖ్యలో కలుసుకున్నానని, హ్యూస్టన్‌ నగరంలోనూ పలువురు తమిళులు తనను కలుసు కున్నారని తెలిపారు. అమెరికాలో విద్యాపరంగాను, సాంకేతికపరంగాను తమిళులు ప్రతిభావంతులుగా వుంటున్నారని ప్రశంసించారు. హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ డాక్టర్‌ రేణు ఖతార్‌ కోరిక మేరకు ఆ విశ్వవిద్యాలయంలో తమిళ అధ్యయన పీఠం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఆ విషయమై త్వరలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామితో సంప్రదింపులు జరుపు తానని చెప్పారు. ఈ సమావేశంలో భారత రాయబారి రాకేశ్‌ పనాటి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌, హ్యూస్టన్‌ విశ్వవిద్యా లయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్కరోవ్‌, ప్రపంచ తమిళ యువజన సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.