(Local) Thu, 24 Sep, 2020

కేసీఆర్ తెలంగాణని ఆరోగ్య తెలంగాణగా మారుస్తారు- హరీష్ రావు

August 05, 2019,   12:31 PM IST
Share on:
కేసీఆర్ తెలంగాణని ఆరోగ్య తెలంగాణగా మారుస్తారు- హరీ ...

సిఎం సొంత స్వగ్రామం చింతమడకలో యశోద హాస్పిటల్స్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని  ఎమ్మెల్యె హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..." సిఎం కెసిఆర్‌ తెలంగాణని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చడానికి చింతమడక ప్రజలు ముందుండాలన్నారు. చింతమడకలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి యశోద ఆస్పత్రి వైద్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో ప్రజలకు అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేస్తారన్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ప్రొఫైల్‌ను అధికారులు సిద్ధం చేస్తారని హరీశ్‌రావు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి చింతమడక నుంచి శ్రీకారం చుట్టడం గర్వ కారణమని ఆయన అన్నారు."

సంబంధిత వర్గం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.