(Local) Thu, 29 Oct, 2020

గుడ్ న్యూస్: హమ్మయ్యా.. విరమించారు!

September 24, 2019,   12:54 PM IST
Share on:
గుడ్ న్యూస్: హమ్మయ్యా.. విరమించారు!

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో తలపెట్టిన సమ్మెను బ్యాంకు అధికారుల సంఘాలు విరమించుకున్నారు. ఈ మేరకు బ్యాంకు సంఘాల నాయకులతో కేంద్ర ఆర్థిక కార్యదర్శి జరిపిన చర్చలు ఫలించాయి. నాలుగు బ్యాంకు అధికారుల సంఘాల నాయకులతో కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ సోమవారం భేటీ అయ్యారు. వేతన సవరణ ఐదురోజుల పనిదినాలు బ్యాంకుల విలీనం నగదు లావాదేవీల సమయంపై వారి మధ్య చర్చ జరిగింది. సంఘాల నాయకులు లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం రాజీవ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించారు. వారు ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాజీవ్‌కుమార్‌ వారికి హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు బ్యాంకు అధికారుల సంఘాలు ప్రకటించాయి.

సంబంధిత వర్గం
అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్బీఐ బ్రాంచ్ ప్రారంభం
అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్బీఐ బ్రాంచ్ ప్రారంభం
ఎస్ బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్
ఎస్ బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.