(Local) Mon, 09 Dec, 2019

‘జార్జి రెడ్డి’ విజయం సాంగ్ రిలీజ్....

November 14, 2019,   6:28 PM IST
Share on:
‘జార్జి రెడ్డి’ విజయం సాంగ్ రిలీజ్....

విద్యార్థి దశలోనే తోటి విద్యార్ధులకు నాయకుడిగా మారి సరైన గమ్యం ఏంటో తెలియజెప్పి, ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన విప్లవ విద్యార్థి జార్జిరెడ్డి. నవ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి ఈ తరం తెలుసుకునేలా ‘జార్జ్ రెడ్డి’.. సినిమాను రూపొందించారు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘వంగవీటి’ ఫేం సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి రోల్ లో నటిస్తోన్న ఈ సినిమా నుండి తాజాగా ‘విజయం’ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయింది.

‘సమరం మనది అయితే.. విజయం మనదె కదా

కలలే కడలి ఒడిలో.. అలలై ఎగిసె కదా 

ఈ విడివిడి అడుగులు ఒకటై పరుగులు పడితే 

జగమంతా మనవెంటే జయమంటూ సాగదా..!’ అని సాగుతుందీ పాట. 

ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల సమస్యలపైనే కాకుండా రైతులు, ఇతర బడుగుబలహీన వర్గాలకు న్యాయం కోసం జార్జిరెడ్డి పడిన తపనను పాటలో పరిచయం చేశారు. ఆనాటి రాజకీయాలను, ఆందోళనలను, విద్యార్థుల పోరాటాన్ని అద్భుతంగా చూపారు. ప్రముఖ చైతన్య ప్రసాద్ రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇప్పటికే విడుదలైన జార్జి రెడ్డి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించగా, ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించారు. ఈ నెల 22న చిత్రం విడుదల కానుంది. 

సంబంధిత వర్గం
రివ్యూ: రాగాల 24 గంటల్లో
రివ్యూ: రాగాల 24 గంటల్లో
బుల్లెట్ సాంగ్ – జార్జ్ రెడ్డి
బుల్లెట్ సాంగ్ – జార్జ్ రెడ్డి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.