(Local) Fri, 05 Jun, 2020

ట్రంప్‌ రిసార్దులో జీ-7 అధినేతల సదస్సు

October 19, 2019,   5:14 PM IST
Share on:
ట్రంప్‌ రిసార్దులో జీ-7 అధినేతల సదస్సు

అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న జీ-7గ్రూపు అధినేతల సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కు చెందిన సొంత గోల్ఫ్‌ రిసార్టులో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ 10 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న 46వ జీ-7సదస్సును ఫ్లోరిడాలోని ట్రంప్‌ నేషనల్‌ డోరల్‌ రిసార్టులో నిర్వహించాలని ఖరారు చేశారు. సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని ఇంతగా దుర్వినియోగం చేసిన వారు ఎవరూ లేరంటూ దీనిపై విమర్శలు వచ్చాయి. 2015 నుంచి ఈ రిసార్టు ఆదాయం పడిపోతుండడంతో దాన్ని పెంచుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్టు వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై శ్వేత సౌధం వివరణ ఇస్తూ వివిధ రాష్ట్రాల్లోని 12 ప్రాంతాలను పరిశీలించగా, వాటిన్నింటికన్నా సగం ఖర్చులో ట్రంప్‌ రిసార్ట్‌ మాత్రమే లభించిందని, అందుకే ఈ ప్రాంతాన్ని సదస్సు కోసం ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.