(Local) Fri, 23 Jul, 2021

విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...

November 15, 2019,   2:18 PM IST
Share on:
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా కెరీర్ జోరు పెంచిన తమిళ్ మాస్ హీరో విశాల్...  సుందర్.సి దర్శకత్వంలో  హై ఓల్టేజ్‌ 'యాక్షన్‌' చిత్రంతో తమిళంతో పాటు తెలుగులో నేడు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటె విశాల్ ఈ రోజు తన 'యాక్షన్' చిత్రం విడుదలతో పాటు తాను నటించబోయే మరో కొత్త చిత్ర పోస్టర్ ని విడుదల చేసి అభిమానుల జోరు మరి కాస్త పెంచాడు....విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మాణంలో విశాల్, రెజీనా హీరో, హీరోయిన్లుగా, ఎమ్ఎస్ ఆనందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి  ‘చక్ర’ అనే టైటిల్ ఫిక్స్ చేసి దానికి సంబంధించిన హీరో విశాల్ లుక్ తో కూడిన పోస్టర్ ని విడుదల చేసారు చిత్రయూనిట్. పోస్టర్‌లో ఉగ్ర నరసింహావతారంలో రౌడీలను చితకబాదుతున్నాడు విశాల్. టైటిల్ లోగో అండ్ డిజైనింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీరెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్, సృష్టి డాంగే, మనోబాల, రోబో శంకర్ తదితరులు నటించనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.

సంబంధిత వర్గం
రివ్యూ: యాక్షన్
రివ్యూ: యాక్షన్
విశాల్ 'యాక్షన్' కి యూ/ఏ సర్టిఫికెట్...
విశాల్ 'యాక్షన్' కి యూ/ఏ సర్టిఫికెట్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.