(Local) Wed, 20 Oct, 2021

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన జూపల్లి కృష్ణారావు

September 11, 2019,   12:05 PM IST
Share on:
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన జూపల్లి కృష్ణారావు

తాను టీఆర్ఎస్ పార్టీ వీడుతానంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదంటూ స్పష్టం చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపల్లి.. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని అన్నారు. తాను నిఖ్సాసైన టీఆర్ఎస్ వాదినని చెప్పుకొచ్చిన జూపల్లి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా మంత్రి పదవులు రాలేదని పలువురు నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. వారందరిని బుజ్జగింజే పనిలో టీఆర్ఎస్ అధిష్టానం నిమగ్నమైంది. తగిన గౌరవం ఇస్తామని అలకపూనిన నేతలను పార్టీ పెద్దలు సముదాయిస్తున్నారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో ధిక్కార స్వరం వినిపించిన కొంత మంది నేతలు తిరిగి మౌనం వహించగా మిగిలిన వారికి సైతం నచ్చజెప్పే పనిలో పార్టీ పెద్దలు ఉన్నారు.

సంబంధిత వర్గం
కాలుష్య తీవ్రతను తగ్గించే ప్రణాళిక -బెర్నీ శాండర్స ...
కాలుష్య తీవ్రతను తగ్గించే ప్రణాళిక -బెర్నీ శాండర్స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.