(Local) Tue, 26 Oct, 2021

ట్విస్టులే ట్విస్టులు....ప్లీజ్ లీక్ చేయోద్దు

August 16, 2019,   5:53 PM IST
Share on:
ట్విస్టులే ట్విస్టులు....ప్లీజ్ లీక్ చేయోద్దు

అడవి శేష్ పేరు డిఫరెంట్ గా ఉన్నట్టే ఆయన సెలెక్ట్ చేసుకునే కథలు కూడా విన్నూతంగా ఉంటాయి అనడంలో ఏ మాత్రం అతిశోయక్తి లేదు.  క్షణం, గూఢచారి వంటి అభిరుచి గల కథాంశాల్నిఎంచుకొని చక్కటి విజయాల్ని అందుకున్న‌ అడవి శేష్ మ‌రోసారి థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. ఆయన నటించిన 'ఎవరు' ఆగష్టు 15న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యం సాధించింది. చిత్రంలో కావాల్సినంత ఉత్కంఠతో పాటు కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. నిజాల్ని తెలుసుకునే ప్రయత్నంలో అబద్దాలు ఎవరిని దోషిగా తేల్చాయన్నది ఆకట్టుకునే అంశంగా మిగిలిపోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌గా, కొంద‌రు ఔత్సాహికులు కీల‌క స‌న్నివేశాల‌ని ఫోటోలు లేదా వీడియోల రూపంలో సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఈ  సినిమా చూడ‌ని ప్రేక్ష‌కుడికి అది వేరేలా వెళుతుంది. ద‌య‌చేసి సినిమాకి సంబంధించి ఎలాంటివి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయోద్ద‌ని అడివి శేష్‌, నవీన్‌ చంద్ర, రెజీనాలు రిక్వెస్ట్ చేశారు. అంతేకాక త‌మ‌కి ఇంత‌టి ఘనవిజయాన్ని అందించిన అభిమానుకుల కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వర్గం
పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది - రవిశ ...
పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది - రవిశ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.