(Local) Fri, 15 Nov, 2019

ఈఎస్ఐ స్కాం నిందితురాలు పద్మ ఆత్మహత్యాయత్నం

October 20, 2019,   4:43 PM IST
Share on:
ఈఎస్ఐ స్కాం నిందితురాలు పద్మ ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో డైరెక్టర్ పద్మను కూడా ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పద్మకు జ్వరం రావడంతో చికిత్స తర్వాత వైద్యులు ఆమెకు మందులు ఇచ్చారు. పద్మ శనివారం సాయంత్రం ఆ మందులను మోతాదుకు మించి ఎక్కువ వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.