(Local) Fri, 15 Nov, 2019

కమల్ కన్నా రజినీనే గొప్ప : దర్శకుడు తేజ

October 19, 2019,   5:13 PM IST
Share on:
కమల్ కన్నా రజినీనే గొప్ప : దర్శకుడు తేజ

మూవీ స్టార్స్ కి అభిమానులు ఉండటం సహజం. అయితే 'మా హీరో గొప్ప అంటే.. మా హీరో సూపర్‌' అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వారి మాటల యుద్ధానికి విరామం ఉండదు. అయితే ఇలాంటి మాటలు కేవలం ఫాన్స్ మద్యే కాకుండా అప్పుడపుడు కొంతమంది సెలబ్రిటీస్ నోటిలో నుండి జారుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన జరిగింది. డైరెక్టర్ తేజ మరోసారి హీరోస్ పై విరుచుకుపడ్డాడు.  తేజ లేటెస్ట్ గా కమల్ హాసన్ , రజిని మధ్య తేడా ఏంటో చెప్పాడు. తన దృష్టిలో కమల్ హాసన్ మహానటుడు కాదని షాకింగ్ కామెంట్స్ చేసాడు. చాలామంది కమల్ హాసన్ గొప్ప నటుడు అనుకుంటారు. కానీ నా ఉద్దేశ్యం ప్రకారం ఆయన గొప్ప నటుడు కాదు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం. ఉదాహరణకు కమల్ హాసన్ దశావతారంలో 10 గెటప్స్ వేశాడు. బాగా చేశాడు అని అంతా అనుకున్నారు కానీ ఆ గెటప్స్ లో కమల్ హాసనే కనిపించాడు ఆయన చేసిన పాత్ర కనిపించలేదు. రజిని రోబో సినిమాలో చూస్తే ఓ సీన్ లో సైంటిస్ట్ రజనీని చంపాలని రోబో ప్రయత్నిస్తుంటుంది. రోబోలా మారువేషం వేసుకున్న సైంటిస్ట్ ను గుర్తుపట్టేస్తుంది. అక్కడ మనం రజినిని చూడం ఆ పాత్రను చూస్తాం. అది నటుడి గొప్పదనం. నటుడు కనిపించకూడదు తాను చేసే పాత్ర కనిపించాలి. అందుకే రజని అంటే చాలా ఇష్టం” అని అన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.