(Local) Wed, 24 Jul, 2019

'వండర్ బార్' మూత‌ప‌డ‌లేదన్న సూపర్ స్టార్ అల్లుడు

July 05, 2019,   1:52 PM IST
Share on:

ధనుష్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడిగానే కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఇలా పలు రంగాల‌లో రాణిస్తున్న ధ‌నుష్ కొద్ది రోజులుగా త‌మ నిర్మాణ సంస్థ‌కి దూరంగా ఉన్నాడని దాని త్వరలో మూసేస్తున్నాడని కోలీవుడ్‌లో కొన్ని పుకార్లు రేగాయి. ఈ వార్తలకి చెక్ పెడుతూ ధనుష్ దీనిపై మీడియా ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు.

'వండర్ బార్' పై వ‌చ్చిన వార్త‌ల‌ని ఖండించాడు. ఏ సంస్థ‌కు అయినా జ‌యాప‌జ‌యాలుంటాయి. మా బ్యాన‌ర్‌లో రూపొందిన చిత్రాలన్నీ మంచి ఫ‌లితాల‌నే రాబ‌ట్టాయి. ర‌జ‌నీ స‌ర్‌తో నా త‌దుప‌రి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న‌నే ఇలాంటి వార్తలు వ‌స్తున్నాయి. ర‌జనీకాంత్ సర్‌తో సినిమా చేయాల‌ని నేను ఆశ‌గా చూస్తున్నాను. మంచి స్క్రిప్ట్ ల‌భిస్తే త‌ప్ప‌క ఆయ‌న‌తో సినిమా చేస్తాను. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తే -నిర్మాణ సంస్థలు మూసేసినట్టేనా. కథపై సాగుతోన్న కసరత్తులు కొలిక్కివస్తే త్వరలోనే తదుపరి ప్రాజెక్ట్ ప్రకటిస్తాం. 'వండర్ బార్' బ్యానర్‌పై వచ్చిన చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాక చెప్పుకోద‌గ్గ వ‌సూళ్ళు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాబ‌ట్టాయ‌ని ధ‌నుష్ పేర్కొన్నారు.  మంచి స్క్రిప్ట్ దొరికితే -రజనీని సంప్రదించటానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాడు ధనుష్.
 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.