(Local) Wed, 21 Aug, 2019

బాలీవుడ్ నటిని బెదిరిస్తున్న మాజీ ప్రియుడు....?

August 13, 2019,   3:22 PM IST
Share on:

రాఖీ సావంత్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు...ఈ బాలీవుడ్ భామ సినిమాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. .  తాజాగా ఈ సెక్సీ భామ ఒక ఎన్‌ఐఆర్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ పెళ్లి వార్త ను ఖండించిన రాఖీ.. ఆ తర్వాత పెళ్లి ని ఖరారు చేస్తూ వరుడి విశేషాలు అభిమానులతో పంచుకుంది. కాగా రాఖీ నన్ను మోసం చేసిందని..దానికి గాను రూ. 4 కోట్లు ఇవ్వాలని రాఖీ మాజీ ప్రియుడు దీపక్ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాడు.దీపక్‌తో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ ప్రకటించింది. ఆ తర్వాత ఆయన్ను వివాహం చేసుకోవడం లేదని సోషల్‌ మీడియాలో తెలిపింది. ఇప్పుడు రాఖీ మరో వ్యక్తి ని పెళ్లి చేసుకున్న నేపథ్యంలో రాఖీ తనను మోసం చేసిందంటూ దీపక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. తనకు రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు నాలుగు రోజుల్లో డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించారు. అయితే దీపక్‌ వ్యాఖ్యల్ని రాఖీ ఖండించారు. ‘నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. నా భర్త గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు’ అంటూ ఆమె వరుస వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.