(Local) Fri, 15 Nov, 2019

ఆర్టీసి పై సీఎం జగన్ మరో నిర్ణయం

October 17, 2019,   10:42 AM IST
Share on:
ఆర్టీసి పై సీఎం జగన్ మరో నిర్ణయం

తెలంగాణలో ఆర్టీసి కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేయాలని సమ్మె చేస్తుంటే సర్కార్ నుంచి కనీసం స్పందన కూడా రావడం లేదు. అయితే ఏపీలో సీఎం జగన్ ఇప్పటికే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే అధికారికంగా విలీన ప్రక్రియ జరగనుంది. అయితే తాజాగా జరిగిన కేబినేట్ భేటిలో సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఆర్టీసిలో 3500 బస్సులు సరైన కండీషన్ లో లేవని అధికారులు గుర్తించారు. దీంతో ఈ బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనాలని కేబినేట్ నిర్ణయించింది. 

కొత్త బస్సుల కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తూ కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. డొక్కు బస్సులన్నింటిని తీసేసి వెంటనే కొత్త బస్సులను కొనాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజలందరికి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో పాటు ఆర్టీసి వ్యవస్థను కూడా పటిష్ట పరచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆర్టీసి పై తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.