(Local) Mon, 12 Apr, 2021

కేంద్రం చేతికి పోలవరం

October 14, 2019,   12:09 PM IST
Share on:
కేంద్రం చేతికి పోలవరం

ఈ మధ్య పోలవరం ప్రాజెక్టు పనుల సందర్శనలో కమలనాధులు, గతంలోని తెలుగుదేశం, ప్రస్తుత అధికారంలోని వైసిపి రాష్ర ప్రభుత్వం పనితీరును విమర్శించి హస్తినలో జలశక్తి శాఖతో ప్రత్యేక సమావేశం జరపడం  ప్రాధాన్యత సంతరించుకొంది. పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌, కేంద్ర అధికారులు సమక్షంలో ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు నిర్మాణదశలు, నిర్వాసితుల పునరావాస ఏర్పాట్లు, తదితర అంశాలపై ప్రత్యేక సమావేశం హస్తినాపురం (ఢిల్లీ)వేదికగా జరుగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కమలనాధులు ఇప్పటికే హస్తినలో మకాం వేశారు . కమలనాధులు రాష్ట్రంలో ఎదగడానికి, పోలవరం ప్రాజెక్ట్ నరేంద్ర మోడీ వరంగా ప్రజలు గుర్తుంచుకొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.