(Local) Sat, 24 Jul, 2021

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం

November 23, 2019,   4:04 PM IST
Share on:
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. వారం రోజుల క్రితం బయో డైవర్సిటీ దగ్గర ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయిన ఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఫ్లై ఓవర్ పైనుంచి అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ… కింద రోడ్డుపై నుంచే వెళ్లే కార్లపై పడింది. కారుపై నుంచి మళ్లీ కారు ఎగురుతూ చెట్టుపై పడటంతో చెట్టు విరిగిపోయింది. చెట్టు కింద నిలబడి ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనలో మరో 10మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో దృశ్యాలు విషాదకరంగా మారి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం బయోడైవర్సిటీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడిన కారు తునా తునకలైంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  కారు ఎగిరివచ్చి చెట్టుపై పడటంతో దాదాపు మూడు చెట్ల వరకు విరిగిపోయాయి. చెట్ల కింద ఉన్న కార్లు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.