(Local) Thu, 14 Nov, 2019

నేడు ప్రారంభం కానున్న బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ పర్యాటక రైలు

October 19, 2019,   5:10 PM IST
Share on:
నేడు ప్రారంభం కానున్న బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ పర్యా ...

గౌతమ బుద్ధునికి సంబంధించి భారత్‌, నేపాల్‌లోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ వెళ్లే ప్రత్యేక బుద్ధిస్ట్‌ సర్క్యూ ట్‌ పర్యాటక రైలును ఐఆర్‌సీటీసీ శనివారం ప్రారంభించనుంది. దిల్లీలోని సఫ్టార్‌ జంగ్‌ స్టేషన్‌ బయలు దేరే ఈ రైలులో నేపాల్‌లోని బుద్ధుడి జన్మస్థలం లుంబిని, బుద్ధుడికి జ్ఞానోదయమైన భారత్‌లోని బోథ్‌ గయా, తొలిసారి ధర్మోపదేశం చేసిన సారనాథ్‌, నిర్యాణం చెందిన కుషినగర్‌ వంటి పలు బౌధ్ధ క్షేత్రాలను సందర్శించేలా ఈ యాత్ర సాగనుంది. ఎనిమిది రోజులు, ఏడు రాత్రులు పాటు సాగే ఈ యాత్రలో పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేసింది. దిల్లీ నుంచి బయలుదేరి బిహార్‌లోని గయా, రాజ్‌గిరి, నలంద అక్కడి నుంచి వారణాసి, సారనాథ్‌ చేరుకుంటుంది. తర్వాత నేపాల్‌లోని లుంబిని అక్కడి నుంచి కుషినగర్‌, శ్రావస్తి మీదుగా ఎనిమిదో రోజు ఆగ్రాకు చేరుకోనుంది.

ఈ రైలులో విలాసవంతమైన హోటళ్లను తలపించేలా కంపార్ట్‌ మెంట్లు ఉండనున్నాయి. ఎనిమిది కోచ్‌లతో కూడిన ఈ బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ రైలులో ఫస్ట్‌ క్లాన్‌లో 96, సెకండ్‌ క్లాస్‌లో 60 ఏసీ బెర్తులు అందుబాటులో ఉంటాయి. రెండు కోచ్‌ల్లో పూర్తిగా రెస్టారంట్‌, డైనింగ్‌ హాల్‌ ఉండగా మరో కోచ్‌లో కిచెన్‌ ఉంది. తేజస్‌ రైలులో ఉన్న విధంగా పూర్తి సౌకర్యాలతో బెర్తులు ఉండడం విశేషం. ఈ రైలులో ప్రయాణించాలంటే ఎనిమిది రోజులకు కలిపి ఒక్కొక్కరికి ఫస్ట్‌ క్లాస్ లో రూ.లక్షా 28వేలు, సెకండ్‌ క్లాస్‌లో రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. పర్యాటకుల అభిరుచిని బట్టి రైలులో వంటకాలు వడిస్తామని నిర్యాహకులు తెలిపారు. ఇండియన్‌, చైనీస్, థాయ్‌ సహా పలు రకాల వంటకాలను ప్రయాణీకులకు అందించనున్నారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.