(Local) Fri, 15 Nov, 2019

అల వైకుంఠపురములో బ్రహ్మీ సాంగ్...?

October 19, 2019,   5:59 PM IST
Share on:
అల వైకుంఠపురములో బ్రహ్మీ సాంగ్...?

బ్రహ్మానందం ఈ పేరు వినగానే ఒక చిన్న చిరునవ్వు అందరి ముఖంలో కనిపించటం సహజంగా జరిగేదే. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి బ్రహ్మీ 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. టాలీవుడ్ లో బ్రహ్మానందం అంటేనే హాస్యానికి పెట్టింది పేరు. ఒకప్పుడు బ్రాహ్మి కోసమే రోల్స్ రాసుకునే దర్శకులు ఇప్పుడు బ్రహ్మీని పక్కనబెట్టేశారు.  అయితే త్రివిక్రమ్ సినిమాల్లో బ్రహ్మికి ఎప్పుడు ఏదో ఓ మంచి పాత్ర దక్కినట్టుగానే ఇప్పుడు తాజాగా అల వైకుంఠపురములోను ఓ చిన్న కామెడీ పాత్ర దక్కింది. ఆ పాత్ర ఎలాంటిది అంటే త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మీని పాయింట్ అవుట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఓ పాట పాడుతూ బ్రహ్మి పనిబడతాడు. ఆ పాట అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. తాజాగా అలాంటి కామెడీ సాంగ్ బ్రహ్మి మీద అల వైకుంఠపురములో ఉండబోతుంది అనేది తాజా సమాచారం. ఈ పాట మొత్తం ఫ్యామిలీ మీద సాగుతుందని స‌ర‌దా సంద‌ర్భంలో సాగే పాటగా ఉండబోతుందని ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ జరిగిందని చెబుతున్నారు. ఈ పాటలో సినిమాలోని మెయిన్ కేరెక్టర్స్ బ‌న్నీ, పూజా, ట‌బు, ప్ర‌శాంత్‌ అంతా కనబడతారు కానీ పాట మొత్తం బ్రహ్మి మీదే ఉండబోతుందట. 

సంబంధిత వర్గం
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ రిలీజ్ చేసిన చిన్నారులు....
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ రిలీజ్ చేసిన చిన్నారులు....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.