(Local) Fri, 22 Oct, 2021

వరుణ్ సినిమా ‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్‌....

August 26, 2019,   5:07 PM IST
Share on:
వరుణ్ సినిమా ‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్‌....

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా, పూజా హెగ్డే కథానాయకురాలిగా 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న చిత్రం 'వాల్మీకి'.  ఈ వాల్మీకి చిత్రం తమిళ్ చిత్రం 'జిగర్తాండా' అనే చిత్రానికి రిమేక్‌గా వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తొలిసారిగా గ్యాంగ్ స్టార్ పాత్రలో మంచి మాస్ లుక్ లో కనిపించి కనువిందు చేయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల సెప్టెంబర్‌ 13న విడుదల కానున్న నేపథ్యంలో వాల్మీకి చిత్ర టైటిల్‌ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారని, అందుకే ఈ సినిమా టైటిల్‌ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి పిటిషన్‌ దాఖలు చేసింది. తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

సంబంధిత వర్గం
కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తు ...
కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తు ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.