(Local) Sun, 27 Sep, 2020

కేంద్రాన్ని బూచిగా చూపించి వైసిపి తప్పించుకుంటోంది - కన్నా

August 22, 2019,   4:18 PM IST
Share on:
కేంద్రాన్ని బూచిగా చూపించి వైసిపి తప్పించుకుంటోంది ...

గడిచిన ప్రభుత్వం చేసిన అరాచక పాలనను, కేంద్రాన్ని బూచిగా చూపించి ఏపీలో వైసీపీ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటి ప్రభుత్వం కూడా కేంద్రం మీదే ఆధారపడిందన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం రెండూ రెండేనని కన్నా పేర్కొన్నారు. ప్రస్తుత వైసీపీ వైఖరి ఎలా ఉందంటే అధికారంలో ఉన్నట్లు ఆపార్టీ నేతలు మాట్లాడటం లేదని .. ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పాలన, కుల పాలన, అవినీతి రాజ్యమేలుతోందన్నారు. బీజేపీ సారధ్యంలోనే అవినీతి రహిత పాలన సాధ్యమని చెప్పారు. పీపీఏ విషయంలో కేంద్రం నుంచి లెటర్‌ వచ్చిందన్నారు. గడిచిన ఐదేళ్లలో అవినీతి జరిగిందని దానిని మోదీ దృష్టికి తీసుకెళ్లి ఉండొచ్చన్నారు. మోదీ అవినీతికి వ్యతిరేకమని.. రూల్స్‌కి వ్యతిరేకంగా నడిచే మనస్తత్వం కాదన్నారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.