(Local) Sun, 16 Feb, 2020

పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

November 27, 2019,   3:41 PM IST
Share on:
పున్నుని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

బుల్లితెరపై దాదాపు ఏడూ భాషల్లో ప్రసారమైన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్...తాజాగా తెలుగులో సీజన్ 3 పూర్తి చేసుకున్న ఈ బిగ్ బోస్ షోకి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ప్రతి సీజన్ లో ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరో ఒకరు ప్రేమ జంటగా మారుతుడటం చూస్తూనే ఉన్నాం...కాగా ఈసారి తెలుగు బిగ్ బాస్  సీజన్ 3 లో కూడా  రాహుల్‌- పునర్నవి ప్రేమలో ఉన్నారంటూ సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ రాహుల్‌ – పునర్నవి పలు సందర్భాల్లో తెలిపారు.
ఇటీవల వీరిద్దరు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాహుల్‌పై పునర్నవి సరదా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను మరోవిధంగా తీసుకున్న రాహుల్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆమెపై ట్రోల్స్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో రాహుల్‌ – పునర్నవి కలిసి తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో ముచ్చటించారు. పునర్నవిని ట్రోల్‌ చేయొద్దని రాహుల్‌ అభిమానులను కోరాడు. పునర్నవిని ఉద్దేశిస్తూ మీరు పెట్టే మెస్సేజ్‌ల వల్ల ఆమె కుటుంబం కూడా ఇబ్బందిపడుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమెను వ్యక్తిగతంగా కించపరిచే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. పునర్నవి తనకు మంచి స్నేహితురాలేనని అన్నారు.

మరోవైపు ఈ నెల 29వ తేదీన రాహుల్‌ తన అభిమానుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని కోరారు. దీనికి సంబంధించి ఓ స్పెషల్‌ వీడియోను కూడా ఆయన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
 

సంబంధిత వర్గం
బిగ్ బాస్ పై యాంకర్‌ ఝాన్సీ అసహనం...
బిగ్ బాస్ పై యాంకర్‌ ఝాన్సీ అసహనం...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.