
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3కి వ్యాఖ్యతగా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో శని ఆదివారాలలో ఆకట్టుకున్నంతగా మిగిలిన రోజులో ఉండటం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే.... బిగ్ బాస్ హౌస్ లో సీక్రెట్ వీడియోలు చూపించడటం...సీక్రెట్ టాస్క్‌లు ఎన్ని ఇచ్చిన ప్రేక్షకులు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇట్టే పసిగట్టేస్తున్నారు. కష్టపడి ప్రోమోల రూపంలో ఆసక్తి రేపేందుకు ప్రయత్నిస్తున్నా.. నెటిజన్లు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకునేట్టుందనేలా ప్రోమోను కట్‌చేసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే అప్పటికే అది సీక్రెట్ టాస్క్ అయి ఉంటుందని మెజార్టీ ఆడియెన్స్ అభిప్రాయడపడగా.. చివరకు అదే నిజమైంది. ఆరోవారానికి గానూ నామినేషన్లోకి వచ్చిన పునర్నవి, హిమజ, మహేష్, రవి, రాహుల్, వరుణ్‌లకు ఓ డీల్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్. వారిలోంచి ఓ ముగ్గురికి సేవ్ అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. దీంట్లో భాగంగా.. వారంతా కాంప్రమైజ్ అయ్యి రవి, రాహుల్, వరుణ్‌లు నామినేషన్లోంచి బయటపడేందుకు ఒప్పుకున్నారు. ఇక ఈ ముగ్గురికి కొన్ని సీక్రెట్ టాస్క్‌లను బిగ్‌బాస్ ఇచ్చాడు. ఈ క్రమంలో బెడ్‌ను నీటితో తడపాలని, షేవింగ్ ఫోమ్‌ను ఒకరి జుట్టుకి రాయాలనే టాస్క్‌లను రవి ఎంచుకున్నాడు. దీంతో వితికా మొహానికి షేవింగ్ ఫోమ్‌ను, శివజ్యోతి బెడ్‌ను నీటితో తడిపాడు. ఇక రాహుల్ వంతు వచ్చేసరికి.. హౌస్‌లోని ఓ సభ్యుడికి కోపం తెప్పించాలి, వరుణ్-వితికాల హార్ట్ షేప్ దిండును చింపేయాలనే వాటిని సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో హార్ట్ షేప్ దిండును ఈజీగానే చించేసినా.. ఓ సభ్యుడికి కోపం తెప్పించడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇంటి సభ్యులందరు రాహుల్ చేష్టలకు చిరాకు పడ్డారు. చివరకు శివజ్యోతిని ‘మూస్కొని పో’ అని ఓ మాట అనేసరికి.. రాహుల్‌పై ఫైర్ అయింది. వరుణ్ టైమ్ వచ్చేసరికి.. ఒకరి మీద కాఫీ పోయాలి, ఎవరి బట్టలైనా ముక్కలుముక్కలుగా చించేయాలనే టాస్కులను ఎంచుకున్నాడు. దీంతో సేఫ్ గేమ్ అన్నట్లు వితికా మొహంపై కాఫీ పోసేసి, ఆమె బట్టలనే చించేశాడు.
దీంతో టాస్క్‌లు పూర్తి చేసినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. అంతేకాకుండా ఆ ముగ్గురికి ఇమ్యూనిటీ లభించిందని.. ఈ వారం పునర్నవి, హిమజ, మహేష్‌లు నామినేషన్లో ఉన్నట్లు బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో ఆ ముగ్గురికి షాక్ కొట్టినట్టైంది. తనకిచ్చిన టాస్క్‌లో గొడవపడ్డ వారందర్నీ క్షమించమని కాళ్లు మొక్కి మరీ అడిగాడు రాహుల్. దీంతో హిమజ, శివజ్యోతి మామూలు స్థితికి వచ్చేశారు. అయితే శ్రీముఖి మాత్రం మళ్లీ అదే రీతిలో స్పందించి.. రాహుల్ తరీఖా నచ్చలేదంటూ దూరం పెట్టే ప్రయత్నం చేసింది. తనకు ఇచ్చిన టాస్కే అలాంటింది.. ఒకరికి కోపం తెప్పించాలని అలా మాట్లాడనని చెప్పే ప్రయత్నం చేసి క్షమించమని అడిగినా.. అదే ధోరణిలో ప్రవర్తిస్తూ వచ్చింది. మొత్తానికి వరుణ్, రవి, రాహుల్.. నామినేషన్ నుంచి తప్పించుకోగా పునర్నవి, హిమజ, మహేష్లోంచి ఒకరు హౌస్‌ను వీడనున్నారు. మరి ఆ ఒక్కరు ఎవరన్నది తెలియాలంటే వీకెండ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
బెల్లంకొండ 8 ప్యాక్ లుక్ లో....సంతోష్ శ్రీనివాస్ ...
28 Nov 2019, 4:17 PM
-
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
28 Nov 2019, 2:54 PM
-
పున్నుని ట్రోల్ చేయొద్దు : రాహుల్
27 Nov 2019, 3:41 PM
-
నిఖిల్ కోసం వస్తున్న మెగాస్టార్...
25 Nov 2019, 5:59 PM
-
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
25 Nov 2019, 5:44 PM
-
వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్...
24 Nov 2019, 10:18 PM
-
శ్రీనివాసరెడ్డిని మెచ్చిన జక్కన్న....
24 Nov 2019, 9:36 PM
-
సంక్రాంతికి మొగుడు గా వస్తోంటున్న సూపర్ స్టార్...
22 Nov 2019, 8:03 PM
-
జార్జిరెడ్డిపై మెచ్చకుంటున్న టాలీవుడ్ ప్రముఖులు...
21 Nov 2019, 5:24 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.