(Local) Fri, 05 Jun, 2020

డే ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ టాస్క్‌లో...బిగ్ బాస్

October 19, 2019,   6:32 PM IST
Share on:
డే ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ టాస్క్‌లో...బిగ్ బాస్

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 చివరికి వచ్చేసింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో విజయవంతంగా 90 రోజులు పూర్తి చేసుకుంది. ‘బిగ్ బాస్ హోటల్ టాస్క్‌’ను కంటెస్టెంట్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ఒక్కో కంటెస్టెంట్‌కి 200 చెప్పున ఏడుగురుకి 14 వందల పాయింట్స్ ఇచ్చారు బిగ్ బాస్. కానీ డ్రిల్స్  విషయంలో నియమాలను పాటించని కారణంగా లగ్జరీ బడ్జెట్‌లో కోత విధించాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే షో చివరి దశకు చేరుకునే సరికి ఫైనల్ విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇప్పటికే వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్‌లు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. నిన్నటి టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు డే ఆఫ్ ఎంటర్ టైన్మెంట్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు వాళ్లకు ఇవ్వబడిన పాత్రలకు అనుగుణంగా ప్రవర్తించాల్సిఉంటుందన్నారు బిగ్ బాస్.

దీనిలో భాగంగా.. బాబా భాస్కర్‌కి బాషా, శ్రీముఖికి మహానటి, వరుణ్-వితికాలు బాహుబలి, దేవసేన, రాహుల్‌కి కాంచన, అలీకి గజిని, శివజ్యోతికి చంద్రముఖి పాత్రల్ని ఇచ్చారు. దీంతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయి జీవించేశారు కంటెస్టెంట్స్.

ముఖ్యంగా కాంచన పాత్ర కోసం రాహుల్ చీరకట్టి బొట్టుపెట్టుకుని ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. షర్ట్ విప్పిన అలీ ఒంటి నిండా పేర్లు రాసుకుని జీవించేశాడు. బాషా,కాంచన,గజినీ కాంబినేషన్‌లో బాబా, రాహుల్, అలీలు ఫుల్ ఫన్ నింపారు.

ఇక ‘నాగేశ్వరరావు గారు వచ్చారా’? అంటూ మహానటికే నటన నేర్పించేలా ఓ రేంజ్‌ పెర్ఫామెన్స్ ఇచ్చింది మహానటి సావిత్రి పాత్రలో శ్రీముఖి. శ్రీముఖి మహానటిగా కంటినుండి కన్నీళ్లు కార్చే సీన్‌ ఫన్నీగా సాగగా.. బాహుబలి దేవసేనలుగా రొమాంటిక్ సాంగ్ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు వితికా వరుణ్‌లు. చంద్రముఖి పాత్రలో శివజ్యోతి పెద్ద పెద్దగా అరుస్తూ బిగ్ బాస్‌ హౌస్‌నే హడలెత్తించింది.

ఓవరాల్‌గా ఈ ఎంటర్‌టైన్మెంట్ టాస్క్‌లో రాహుల్ పెర్ఫామెన్స్ పీక్స్ అనే చెప్పాలి. కాంచనగా అతను చీరకట్టుకుని బొట్టుపెట్టుకుని టైటిల్ సాంగ్‌కి పూనకం వచ్చినట్టు స్టెప్పులు వేశాడు. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. టాస్క్‌లలో బాగా పెర్ఫామ్ చేయి నాన్నా అని తన తల్లి చెప్పిన మాట గుర్తుకు వచ్చిందో ఏమో కాని కాంచన పాత్రలో పూనకం వచ్చినట్టు చెలరేగిపోయాడు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.