(Local) Mon, 23 Sep, 2019

'వార్' జరగకుండా సైరా వెనక్కి జరుగనుందా....?

August 29, 2019,   3:54 PM IST
Views: 79
Share on:
'వార్' జరగకుండా సైరా వెనక్కి జరుగనుందా....?

ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమా నుండి పెద్ద సినిమాల వరకు రిలీజ్ ఉండటంతో థియటర్స్ సరిపోక, చాల వరకు సినిమా విడుదల పోటీ పడుతుండంతో కొన్ని చిత్రాలు రిలీజ్ డేట్ పోస్టుపోన్ చేసుకుని వెనక్కి జరుగుతున్నా సంఘటనలు చూస్తూనే ఉన్నాం. సెప్టెంబర్ 13న నాని గ్యాంగ్ లీడర్ కోసం మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ వాల్మీకి రిలీజ్ ని వెనక్కి జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా ఫాన్స్ కి మరో షాక్.... ఈ సంవత్సరం రిలీజ్ కానున్న అతి పెద్ద సినిమాల్లో సైరా నరసింహ రెడ్డి ఒకటి. రామ్ చరణ్ తన తండ్రి కోసం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఐతే దీనికి సంబందించిన ఒక న్యూస్ ఇపుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది. సైరా ఒక విషయంలో తన సినిమా విడుదల తేదీని మార్చుకున్నట్లుగా ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దానికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా తొందర్లో వెలవడించే ఛాన్స్ వుంది.

అక్టోబర్ 2న హృతిక్ రోషన్, టైగర్ ష్రాప్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వార్' రిలీజ్ అవుతోంది. దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వల్ల కచ్చితంగా సైరా హిందీలో నష్టపోవడం ఖాయం. థియేటర్స్ కూడా దొరకడం లేదని రామ్ చరణ్ కి బయ్యర్లు తెలిపినట్లు సమాచారం. దీనితో రామ్ చరణ్ కూడా తేదీని మార్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్. అక్టోబర్ 2 కి బదులుగా, అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్లాన్. ఏదేమైనా లోకల్ డిస్ట్రిబ్యూటర్ల తో మాట్లాడిన తర్వాత డిసైడ్ కానున్నారని సమాచారం. అక్టోబర్ 8 నుండి ఆదివారం వరకు వరుస సెలవలు కావడం తో భారీ వసూళ్లను రాబట్టొచ్చని తెలుస్తుంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత వర్గం
చిక్కుల్లో 'సైరా నరసింహారెడ్డి'...హైకోర్టులో పిటిష ...
చిక్కుల్లో 'సైరా నరసింహారెడ్డి'...హైకోర్టులో పిటిష ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.