(Local) Thu, 21 Nov, 2019

NBK 105 థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ కంప్లీట్.....

August 29, 2019,   4:52 PM IST
Share on:
NBK 105 థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ కంప్లీట్.....

హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం తెరకెక్కతున్న సంగతి విదితమే. అయితే మునుపెన్నడు కనిపించని విధంగా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చిన నందమూరి బాలయ్య సరికొత్త లుక్  సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి అభిమానులకు సరికొత్త కిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చిన బాలయ్యను బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది.  చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, కొంత టాకీపార్ట్‌, భారీ యాక్షన్‌ ఏపిసోడ్‌ను షూట్‌ చేశారు.  సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
 

సంబంధిత వర్గం
'రూల‌ర్' లో బాలయ్య న్యూ లుక్‌ రిలీజ్...!
'రూల‌ర్' లో బాలయ్య న్యూ లుక్‌ రిలీజ్...!
బాలకృష్ణ సరికొత్త లుక్ వైరల్...
బాలకృష్ణ సరికొత్త లుక్ వైరల్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.