(Local) Sat, 07 Dec, 2019

ఎన్‌ఆర్‌సి ప్రక్రియలో మతపరమైన వివక్షలు ఉండవు -అమిత్ షా

November 21, 2019,   11:22 AM IST
Share on:
ఎన్‌ఆర్‌సి ప్రక్రియలో మతపరమైన వివక్షలు ఉండవు  -అమి ...

దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ ముసాయిదా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్‌షిప్-ఎన్‌ఆర్‌సిను అమలుచేస్తామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. అసోంలో నిర్వహించినట్టే అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్‌ఆర్‌సి నిర్వహిస్తామన్నారు. ఎన్‌ఆర్‌సి ప్రక్రియలో ఎలాంటి మతపరమైన వివక్షలు ఉండబోవని స్పష్టం అమిత్‌ షా చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగుతుందని, అక్రమ వలసదారులను గుర్తించేందుకే ఎన్‌ఆర్‌సి తీసుకొస్తున్నట్టు ఆయన చెప్పారు. అదే సమయంలో వివక్షకు గురై ఇతర దేశాలనుంచి వలస వచ్చిన అన్ని మతాల శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని తెలిపారు. జాతీయ పౌరసత్వ బిల్లును లోక్‌సభ ఆమోదించిందని, సెలెక్ట్ కమిటీ ఆమోదం తర్వాత సభ రద్దయిందని గుర్తుచేశారు. త్వరలోనే పౌరసత్వ బిల్లు సభ ముందుకు వస్తుందని అమిత్‌ షా అన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.