(Local) Wed, 12 May, 2021

సూపర్ స్టార్ బిజినెస్ కి అవార్డు.....!!

August 28, 2019,   12:32 PM IST
Share on:
సూపర్ స్టార్ బిజినెస్ కి అవార్డు.....!!

సూపర్ స్టార్ మహేష్ ఒక పాక్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క బిజినెస్ పరంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో ఏషియన్ గ్రూప్ సంస్థ తో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబడిన మల్టీప్లెక్స్ ఏఎంబి సినిమాస్ ఘనంగా ప్రారంభమైన సంగతి విదితమే.  ఈ మల్టిప్లెక్స్ నాణ్యత ప్రమాణాలపై ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పొగడ్తలు కురిపించారు.  ఈ ఏడాది ప్రకటించిన ఐమాక్స్ బిగ్ సినీ అవార్డ్స్ 2019లో, బెస్ట్ మల్టిప్లెక్స్ ఆఫ్ ది ఇయర్ గా ఏఎంబి సినిమాస్ అవార్డును సొంతం చేసుకున్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది. కాగా ఏఎంబి సినిమాస్ మానేజ్మెంట్ టీమ్ ఆ అవార్డును అందుకుంటున్న ఫోటోను మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ, ‘బెస్ట్ మల్టిప్లెక్స్ ఆఫ్ ది ఇయర్ గా ఏఎంబి సినిమాస్ కు అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డు దక్కడానికి కారకులైన మల్టిప్లెక్స్ మానేజ్మెంట్ మరియు స్టాఫ్ కు తన తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెల్పుతూ పోస్ట్ చేసారు మహేష్ బాబు’….!!

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.