(Local) Fri, 07 May, 2021

తనపై వచ్చిన గాసిప్ ని నిజం చేసిన ప్రముఖ హీరో...

November 13, 2019,   1:36 PM IST
Share on:
తనపై వచ్చిన గాసిప్ ని నిజం చేసిన ప్రముఖ హీరో...

రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోను ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది....ఈ విషయంలో మాత్రం బాలీవుడ్ హీరోల రూట్ సపరేట్ అనే చెప్పుకోవాలి....అందులోనూ బాలీవుడ్ కిలాడీ స్టైల్ మాత్రం ఎవరికీ అంతుపట్టదు...ఎందుకంటే అక్ష‌య్ ఏం చేసిన రొటీన్ కి బిన్నంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు...ఈ యాక్షన్ హీరో ఏం చేసిన సూపర్ గానే ఉంటుంది. తాజాగా త‌న పై క‌ల్పిత వార్త రాసిన వెబ్‌ సైట్‌ కి ఓ వీడియోతో భలే జవాబు చెప్పారు.  అసలు విషయం ఏంటంటే... అక్ష‌య్ ప్రస్తుతం రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌వంశీ అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఓ వెబ్ సైట్ రోహిత్‌, అక్ష‌య్‌కి సంబంధించి త‌ప్పుడు వార్తలు రాసింది. వారిద్ద‌రు గొడ‌వ‌ప‌డ్డార‌ని, వీరిని క‌లిపేందుకు క‌ర‌ణ్ జోహార్ మీడియేటింగ్ చేస్తున్నాడని రాశారు.

దీంతో త‌ప్పుడు వార్త రాసిన వెబ్‌ సైట్‌ కి అక్షయ్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. అక్ష‌య్, రోహిత్‌ నిజంగానే ఒక‌రినొక‌రు కొట్టుకున్న‌ట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో స్టార్టింగ్‌ లో కత్రినా ఫోన్‌ లో ఆ తప్పుడు వార్తను చూపిస్తూ.. వార్త చూశారు కదా, చూడండి నిజంగానే ఇప్పుడు అక్షయ్, రోహిత్ కొట్టుకుంటున్నారు అంటూ వెనక్కి వెళ్తుంది. వెంటనే అక్ష‌య్, రోహిత్‌ వచ్చి కొట్టుకుంటుంటే అందరూ వచ్చి వారిని ఆపుతారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సూర్యవంశీ సినిమాలో క‌త్రినా కైఫ్ హీరోయిన్‌.  షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సంబంధిత వర్గం
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
డిసెంబర్‌ 6న మూడవ 'పానిపట్‌' యుద్ధం....
డిసెంబర్‌ 6న మూడవ 'పానిపట్‌' యుద్ధం....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.