(Local) Sun, 27 Sep, 2020

ఫోర్బ్స్ లిస్ట్ దృష్ట్యా బాలీవుడ్ హీరో ఆదాయం....!

August 22, 2019,   6:07 PM IST
Share on:
ఫోర్బ్స్ లిస్ట్ దృష్ట్యా బాలీవుడ్ హీరో ఆదాయం....!

బాలీవుడ్ లో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కేవలం నటనలో మాత్రమే కాకుండా చాల విషయాలలో ముందుంటాడని తెలిసిన సంగతే. తాజాగా ఈ బాలీవుడ్ హీరో భారతీయ నటుల్లో అత్యధిక పారితోషికం పొందుతున్న నటుడు మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా పారితోషకం తీసుకునే వాళ్లలో నాలుగో స్థానంలో అక్షయ్ నిలిచాడు. 2019 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ మేగజైన్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల వివరాలు తెలియజేసింది. ఓవరాల్‌గా చూస్తే హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 89.4 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, క్రిస్ హెమ్స్‌వర్త్ 76.4 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో  రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ - 66 మిలియన్‌ డాలర్లు కాగా బాలీవుడ్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత అక్షయ్ కుమార్ 65 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. జాకీ చాన్ 58 మిలియన్‌ డాలర్లు తో  ఐదో స్థానంలో ఉండగా, భారతీయ నటుల్లో అక్షయ్ ఒక్కడే టాప్ టెన్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. మొత్తంగా చూసినైట్లెతే, భారత్ తరఫున అక్షయ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం... 2018, జూన్ 1 నుంచి 2019, జూన్ 1 లోగా అక్షయ్ 65 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 466 కోట్లు) సంపాదించినట్లు తేలింది. అక్ష‌య్ ఒక సినిమాకి కనీసం 5 నుండి 10 మిలియన్ల వరకు వసూలు చేస్తాడని తెలుస్తోంది. 

సంబంధిత వర్గం
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.