(Local) Tue, 21 Sep, 2021

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రత్నాలు ఎలా ధరించాలి!

July 04, 2019,   11:21 PM IST
Share on:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రత్నాలు ఎలా ధరించాలి!

జ్యోతిష్యశాస్త్రం అనేది నమ్మకం మీద ఆధారపడే శాస్త్రం. మనిషి జీవితంలో జ్యోతిష్యం… వాస్తు రెండిటి ప్రభావం కలిసి వుంటుంది. ఇందులో జ్యోతిష్యం శారీరక అంగాలలో కన్ను అయితే… వాస్తు దృష్టిలాంటిది. ప్రతివాడి జీవితం ఈ రెండిట ప్రభావాన్ని దాటి వుండవు. నన్ను కలుస్తున్న అనేక మంది పాఠకులకి కలవాలని ప్రయత్నిస్తున్నా అసంఖ్యాకతమైన పాఠకులకి కొన్ని సూచనలు చేయటం నా అభిమతం.
* భరణి, పూర్వాషాఢ, పుబ్బ నక్షత్రాలలో పుట్టాం, మేం శుక్ర దశలో పుట్టామని ‘డైమండ్‌’ ధరించాం అంటారు కొందరు…
* మాకు ఏలినాట శని జరుగుతోంది… అని ‘నీలం’ ఇచ్చారు పెట్టుకున్నాం అని ఇంకొందరు అంటారు. 
* మొన్నటి దాకా శుక్ర దశలో ‘రాహువు’ అంతర్దశ అని ‘గోమేధికరం’ పెట్టాం. ఇప్పుడు శుక్ర దశలో ‘గురువు’ అంతర్దశ అని ‘పుష్యరగం’ పెట్టుకుంటాం అని ఇంకొందరు చెబుతున్నారు…
* ఇదిలావుంటే అసలు ఈ విధానాలు సరైనవేనా? ఇలా పెట్టుకున్నా మాకు మంచి ఫలితా లు జరగటం లేదు అంటున్నారు ఇంకొందరు…

శుక్రదశలో పుట్టామని డైమండ్‌, రాహు నక్షత్రంలో (ఆరుద్ర, శతభిషం, స్వాతి) పుట్టామని గోమేధికం, గురు నక్షత్రాలలో (పునర్వసు, విశాఖ పుర్వాభాద్ర) కనక పుష్యరాగం, కేతు నక్షత్రాలలో (అశ్వని, మఖ, మూల) పుట్టామని పిల్లి కన్నురాయి, రావి, నక్షత్రాలలో (కృత్రిక, ఉత్తర, ఉత్తరాషాఢ) అని ‘కెంపు’ శని నక్షత్రాలు (అనూరాధ, పుష్యం, ఉత్తరాభాద్ర అని ‘నీలం’ బుధ నక్షత్రాలు (ఆశ్రేష, జేష్ఠ, రేవతి) అని ‘పచ్చ’) చంద్ర నక్షత్రాలు (రోహిణి, హస్త, శ్రవణ) అని ‘ముత్యం’ ధరించటం సరైన విధానాలు కాదు.

ఇంకొందరు నవరత్నాలు కలిపి ధరిస్తారు. అది కూడా సరైనది కాదు. మనిషి… మనిషికి జాతకంలో తేడా వున్నట్లే సరిపోయే రత్నాలు వేరుగా వుంటాయి కదా!
నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకొని ‘రత్నధారణ’, దశను ప్రధానంగా తీసుకొని, ఏలినాటి శని అని, కుజదోషం అని… ఇంకా నవరత్నధా రణ (అన్నీ కలిపి ధరించాం కదా! అని) ఇలా రత్నధరణ చేస్తే ఉపయోగం లేదు.
సరిగ్గా తెలుసుకోకుండా పైన చెప్పినట్లుగా నక్షత్రాల బట్టి, రాశుల బట్టి, దశలను బట్టి, కుజ, శని కేతులను బట్టి రత్నాలు ధరిస్తే మం చి ఫలితాలకన్నా ఇబ్బందులే ఎక్కువ ఎదుర్కొ నే వారి సంఖ్య చాలా చాలా ఎక్కువగా వుంది.

శాస్తమ్రులో తప్పలేదు. కాని సాధన చేసి చెప్పే వ్యక్తులలో తేడా వుంటుంది. తాత్కాలికంగా ఏదో రత్నం సమయానికి చెప్పి ఆ దశ దాటాక మరో రత్నం చెప్పి… ఇది కాకపోతే అది పెట్టుకో అని కొందరు జోతిష్యులు చెప్పినా.. ఫలితాన్ని అనుభవించాల్సింది పెట్టుకున్న వారే కదా!
సరైన (మనకి సరిపోయే) రత్నాన్ని ఖచ్చితంగా చెప్పగలగిన జోతిష్కుని ఎన్నిక చేసుకోవటం కూడా ఒక అదృష్టమే అని చెప్పాలి. మనకి సరైన సమయం వస్తే తప్ప అలాంటి వ్యక్తిని కలవలేం రకరకాల రత్నాలు ధరించి విసిగిపోయి ఏది పెట్టుకోవాలో, ఏది పెట్టుకోకూడదో… అర్ధం కాక విసిగిపోయి.. విరక్తి కలిగి శాస్త్రం మీదనే అపనమ్మకం ఏర్పడి ‘అ బ్బే’… చాలా మంది జ్యోతిష్కులనికలిశాం… వారు చెప్పిన ఆ రత్నాన్ని ధరించా… ఈ ర త్నాన్ని ధరించాం… పెద్ద మార్పు ఏమీ లేదు. అని వాపోయే వారి సంఖ్య కోకొల్లలు.

నిజమేఇలా బాధపడి. అనేకమంది జ్యోతిష్కులని కలిసి విసుగెత్తి అన్నీ తీసి పక్కన పడేసే వ్యక్తులకి కొన్ని సూచనలు ఇవ్వటమే నా ప్రధాన ఉద్దేశ్యం.
1. అసలు నక్షత్రాల ఆధారంగా, దశల ప్రధానంగా, దశల బట్టి ‘రత్నాన్ని’ సూచిస్తే అది సరైన పద్ధతి కాదు అని గ్రహించండి.
2. మీరు పుట్టిన తేది, సమయం, స్థలం ఆధారంగానే జాతక చక్రాన్ని తయారు చేసి దానిలో గ్రహస్థితి ఆధారంగా మీరు ‘ఏవిధమైన రత్నాన్ని సూచించాలో తెలిసిన పండితులని మాత్రమే సంప్రదించండి.
3. దశ… దశకి రత్నాలు మారటం అనేది నిజం కాదు అని గ్రహించండి (అంటే శుక్రునిలో రాహువు అని గోమేధికం, ఆ తర్వాత శుక్రునిలో గురువు అని పుష్యరాగం’).

4. ప్రత్యిక్తికి నవరత్నాలు పని చేయవని స్పష్టంగా గ్రహించండి. మనకి నవగ్రహాలలో సరైన (సహాయ పడే) గ్రహాలు ఎవరికైనా కొన్ని వుంటాయి. 9కి సరిపోవు అలాంటప్పుడు ఆ సహాయపడే గ్రహాల స్థానాన్ని, స్థితిని ఆధారంగా చేసుకొని ‘అత్యవసరమైన రత్నం ఒకటిగాని’ కొన్ని సందర్భాలలో 2, 3 వుండచ్చు’ అది గమనించి రత్రధారణ చేయాలి. అంతేగాని, నాదికర్కాటక రాశి… అని ముత్యం పెట్టుకున్నాను అంటే సరికాదు.
5. ముందుగా మీ జాతకాన్ని పూర్తిగా విశ్లేషించి దానిలో గ్రహబలాలను బట్టి మీరు వుపయోగపడేరత్నాన్ని/ రత్నాలని ఇస్తేనే మీకు మంచి ఫలితం వుంటుంది.
6. అలాకాకుండా ఆ దశకి ఒక రత్నం, ఆ దశ అయ్యాక వేరే దశకి వేరే రత్నం అంటూ పెడితే ఎన్ని రత్నాలని ధరిస్తారు?

7. రాశిని బట్టి, దశబట్టి, దోషం బట్టి.. ఇలా ఎన్ని ధరించాలి?
8. సరికాని రత్నంధరించి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.