(Local) Mon, 23 Sep, 2019

మధుపర్కం అంటే  ఏమిటి?

June 01, 2019,   1:46 PM IST
Views: 97
Share on:
మధుపర్కం అంటే  ఏమిటి?

వివాహ సమయంలో మధుపర్కం ఇవ్వడం ఆనవాయితీ దానిని జనాలు ఈ మధ్యకాలంలో తెల్లని బట్టలు అనుకొంటున్నారు. వివాహంలో కుమార్తెకు భర్తగా వరుని ఎంపిక తరువాత అతను వధువు తల్లితండ్రులకి  సంప్రదాయం అనుసరించి పుత్ర సమానుడౌతాడు. వేద సహితమైన మంత్రాలతో వధువు తల్లితండ్రులు వరునికి బలం కోసం సమర్పించే దానిని మధుపర్క పానీయం అంటారు. మధుపర్కం తాగక వధువుకూ, వరునకూ కూడా నూతన వస్త్రాలు ఇచ్చే సందర్భంలో పెట్టే బట్టలు కనుక వాటికి ఆ పేరు వచ్చింది అంతేకానీ మధుపర్కాలకూ, బట్టలకూ ఎటువంటి సంబంధం లేదు. 
మధుపర్కం అంటే తేనేతో కూడుకున్న మిశ్రమం. సమపాళ్ళలో పాలు లేదా పెరుగును తేనెతో కలిపి ఇచ్చే  మిశ్రమమే మధుపర్కం. మధుపర్కము సమర్పించడం  అంటే తీయని పానీయము అని అర్ధము. ఇంతకు ముందు దీనిని ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతము దీనికి బదులుగా వరునికి పంచదార రుచి చూపిస్తున్నారు.
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.