(Local) Sat, 06 Jun, 2020

యంత్రములు అంటే ఏమిటి - వాటి ఫలితాలు

June 27, 2019,   2:29 PM IST
Share on:
యంత్రములు అంటే ఏమిటి - వాటి ఫలితాలు

హిందూమ‌త చింత‌న ప్ర‌కారం ఈ లోకంలోని స‌ర్వ‌శ‌క్తులు ఆదిశ‌క్తి నుండి ఉద్భ‌వించాయి. ఈ విశ్వ‌జ‌న‌నికి ఒక నిర్ధిష్ట రూపంలేదు. అయితే ధ్యాన‌శ‌క్తితో ఆ రూపాన్ని ద‌ర్శించిన రుషులు ఒక యంత్ర‌రూపం మ‌న‌కు ప్ర‌సాదించారు. ఈ యంత్రం రేఖ‌లు, వృత్తాలు, త్రిభుజాలుగా ఈ సువిశాల విశ్వానికి ప్ర‌తిబింబంగా రూపొందించారు. యంత్రము అనగా ముందుకు వెళ్లేవి, ముందుకు నడిపించునవి అని అర్ధం. అంటే ఎవరైతే ఒక దైవ యంత్రాన్ని ఆరాధిస్తూ ఉన్నారో వారికి భగవదానుగ్రహం కలిగించును.  అమ్మవారి లలితా సహస్రనామాలకు మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహాసనా లని అమ్మవారి నామాలకి చెప్పబడుచున్నది అంటే అన్ని యంత్రములకు ప్రతినిధి అమ్మవారే. 

ఇక భగవంతుని ప్రాణ శక్తి యంత్రరూపంగా ఉంటుంది. ఏ దేవాలయం నిర్మాణం జరిగినా ధ్వజస్ధంబం నిలబెట్టినా, దేవతా విగ్రహం ప్రతిష్టకంటే ముందు యంత్ర ప్రతిష్ట చేస్తారు. కారణం యంత్రానికి ఉండే అమోగమైన శక్తి ఆ దేవతామూర్తిలో ప్రవేశించి అమోగమైన చైతాన్యాన్ని కల్గిస్తున్నది. భారతదేశమున ఆదిశంకరాచార్యుల వారు అనేక దైవక్షేత్రాలలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన చేయబట్టి లోకం అంతా శాంతి సుభిక్షాలతో పాడిపంటలతో వర్ధిల్లిచున్నది అటువంటి శక్తి ఒక యంత్రానికి ఉన్నది.యంత్రాలు బంగారు రేకుల మీద, వెండి మీద, రాగి మీద, అరతి ఆకుమీద, ఇంకా కాగితం మీద కూడా గీస్తారు. యంత్రం అవసరం ఉపయోగాన్ని బట్టి దేనిమీద గీయాలో మంత్ర   గ్రంధాలు తెలుపుతున్నాయి. వ్యాపారస్తులు 'జనాకర్షణ యంత్రం ' పెట్టుకుంటారు. దాని వల్ల వ్యాపారం మరింత ప్రజలు రావతం వల్ల వృద్ధి చెందుతుందని నమ్ముతారు. 

సకల వాస్తు దోషాలు పోగొట్టుకోవాలంటే గోడలు పగలగొట్టుకుని, ఇల్లు మళ్ళి కట్టుకోనక్కర్లేదు, మత్స్య యంత్రం ఒకటి పూజించి ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు నివారించ బడతాయి. కూర్మ యంత్రం స్థిరత్వానికి చిహ్నం. నరఘోష యంత్రం కొంత దృష్టిదోషాన్ని నిర్మూలిస్తుంది.  ప్రతి యంత్రంలోను రాయబడిన బీజక్షరాలు, త్రికోణ, వర్తుల, చతురస్ర నిర్మాణాలు ఆయా శక్తులని, దిక్పాలకులని, విశ్వంలో ఆ మూల ప్రకృతికి చెందిన ఆది శక్తిని ప్రేరేపించి మంచి ఆలొచనలని, ఆనందకరమైన వాతావరణాన్ని కలగ చేస్తాయి. కొన్ని యంత్రాలని ధరిస్తారు కూడా. మరీ ఫొటో ఫ్రేం అంత కాకుండా, చిన్న తాయెత్తుల్లో యంత్రాలని ధరించ వచ్చు. దీర్ఘకాల వ్యాధులకి ఇవి బాగా పనిచేస్తాయి. మంత్ర జపాలు చేయలేని వారు యంత్రాల ద్వారా కార్యాన్ని సాధించ వచ్చు. మంచి యంత్రాన్ని అర్చించి శక్తివంతం చేసుకుని ఫలితాన్ని పొందవచ్చునని మేరుతంత్రం లాంటి గ్రంధాలు తెలుపుతున్నాయి.మత్స్య యంత్రము

మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి 'మత్స్యావతారము'. విష్ణు ద‌శావ‌తార‌ముల‌లో మొట్టమొద‌టి అవ‌తార‌మే మ‌త్స్యావ‌తార‌ము వేద స‌ముద్ధర‌ణ‌కై అవ‌త‌రించిన శ్రీ మ‌హావిష్ణువు రూప‌ము. ఈ యంత్రము, ఇత‌ర యంత్రముల క‌ంటే చాలా విశిష్టమైన‌ది. స‌మ‌స్త వాస్తు దోష నివార‌ణ యంత్ర రాజ‌ము ఇది. ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము – వాని ప్రస్థార‌ము నందు గ‌ల స‌ప్తావ‌ర‌ణ‌ల‌లోను అతి ముఖ్యము శ‌క్తివంత‌మైన బీజాక్షర‌ముల‌తో రూపొందించ‌బ‌డి, స‌ర్వ సాంప్రదాయాను కూల‌ముగా నిర్మించ‌బ‌డింది.

పూజా విధి ఈ మ‌త్స్య యంత్రమును శాస్త్రానుసార‌ముగా దైవ‌జ్ఞుల‌చే త‌యారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ క‌ళాన్యాస‌, ప్రాణ‌ప్రతిష్టాదుల‌ను జ‌రిపించి, శుభ స‌మ‌య‌మున యంత్ర పూజ‌, జ‌పాదుల‌ను ప్రారంభించ‌వ‌లెను. ఈ యంత్రమును శ‌క్తివంత‌ముగా చేయుట‌కై విధి విధాన‌మును మిగిలిన యంత్రముల క‌న్న కొంచెం ఎక్కువ‌గానే నిర్ధేశింప‌బ‌డిన‌ది.

మత్స్య యంత్రమును 
శ్లో || స్వర్ణేన రజతే నాపి పంచాంగుళ ప్రమాణకమ్ |
యంత్రపత్రం విరచ్యాధ సప్తకోణం లిఖేత్పురమ్ |
వాదిక్షాంతాని ‍ బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |
మధ్యేతు మత్స్య మాలిఖ్య గృహస్థాపన శోభనమ్ |
అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |
శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ ||

మత్స్య యంత్రంను ఐదు శేర్ల ధాన్యములో ఒక దినం, పంచామృతములందు ఒక దినం మంచి నీటిలో ఒక దినము ఉంచి పూజించి సహస్రాష్టోత్తర శతగాయత్రి జపమును చేసి మూల మంత్రజపము పూర్తి అయ్యిన పిదప శంఖు స్థాపన చేసిన గృహ స్థలములలో ఈ యంత్రమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ యంత్రంను స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు, కూప వేధలు, స్తంభ వేధలు, వీధి శూలలు ఆయుర్ధాయము నశించిన గృహ దోషములు, శంఖు స్థాపన చేయక కట్టిన దోషమును మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.