(Local) Tue, 02 Jun, 2020

టిటిడి వసతి గదుల బుకింగ్‌లో స్వల్పమార్పులు

June 29, 2019,   11:20 AM IST
Share on:
టిటిడి వసతి గదుల బుకింగ్‌లో స్వల్పమార్పులు

భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో గదుల బుకింగ్‌లో టిటిడి స్వల్పమార్పులు చేపట్టింది. జూలై 1వ తేదీ నుండి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.ఈ మేరకు విష్ణునివాసం వసతి సముదాయంలో అన్ని గదులను కరంట్‌ బుకింగ్‌లో మాత్రమే కేటాయిస్తారు. ఇక్కడ భక్తులు గదులు పొందిన సమయం నుండి 24 గంటలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుంది.

ఐతే శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో అన్ని గదులను ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ ఉదయం 8 నుండి మరుసటిరోజు ఉదయం 8 గంటల వరకు 24 గంటల స్లాట్‌ విధానం అమల్లో ఉంటుంది. బుక్‌ చేసుకున్న సమయం కంటే ఆలస్యంగా చేరుకున్నా నిర్దిష్ట సమయానికి ఖాళీ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.