(Local) Mon, 30 Mar, 2020

ఘటోత్కచుడి జననం!

July 10, 2019,   1:31 PM IST
Share on:
ఘటోత్కచుడి జననం!

పాండవులు లక్క ఇంటిని వదిలి అడవిలో తలదాచుకునే తరుణంలో, హిడింబి అనే రాక్షస జాతి స్త్రీ భీమసేనుడిని చూసి మనసు పడుతుంది. కాగా హిడింబి తనతో కలిసి బ్రతకమని భీమసేనుడిని కోరగా అందుకు ఆయన ఒక షరతు విధిస్తాడు. ఆమెకి ఒక బిడ్డ జన్మించే వరకే కలిసి ఉంటానని. ఆ తరువాత విడిచి వెళ్ళడానికి ఆమె అనుమతిస్తేనే అంగీకరిస్తానంటాడు. హిడింబి అందుకు అంగీకరించగా భీమసేనుడు తల్లి ఆజ్ఞ మేరకు హిడింబితో జీవనం మొదలుపెడతాడు. వారికి ఘటోత్కచుడు అనే కుమారుడు కలిగిన తరువాత పాండవులు అక్కడినుండి నిష్క్రమిస్తారు. ఆ బిడ్డ తల ఘటం(కుండ) లాంటి ఆకారంతో ఉండటం వల్ల ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. ఘటోత్కచుడు పెరిగి పెద్దైన తరువాత మంచి యోధుడవుతాడు. మహాభారత యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.