(Local) Mon, 09 Dec, 2019

భోజనం చేసేటప్పుడు పిల్లల్ని తిట్టకూడదా ...?

June 30, 2019,   3:57 PM IST
Share on:
భోజనం చేసేటప్పుడు పిల్లల్ని తిట్టకూడదా ...?

పిల్లలైనా.. యువకులైనా తెలిసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే.. వాళ్లు భోజనం చేసే సమయంలో తల్లిదండ్రులు మందలించడం జరుగుతుంటుంది. ఆ మాటలను భరిస్తూనే బాధపడుతూనే వాళ్లు భోజనం చేస్తారు. ఇలా ఆవేదనని అణచుకుంటూ చేసిన భోజనం వంటబట్టకపోగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెస్తుందని పండితులు సూచిస్తున్నారు.కొంతమంది ఆవేశాన్ని అణచుకోలేక అన్నం కంచాన్ని విసిరికొడుతూ వుంటారు. జీవితంలో ఎవరైతే అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తారో.. కోపంతో విసిరి కొడతారో అది వారికి దూరమవుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు.

ముఖ్యంగా నేటి యువతి, యువకులు అన్నం తినాలంటే చాల అయిష్ట చూపుతుంటారు. ఇది మరి ప్రమాదకరం. అన్నం తినాలంటే చాల ఇబ్బంది పడుతుంటారు. అన్నం అంటే  అన్నపూర్ణ దేవి. ఆమెను నిర్లక్ష్యం చేస్తే.. ఎదురుగా అన్నం ఉన్న తినలేని పరిస్థితి రావచ్చు అనగా  మనకు  ఆరోగ్యం బాగాలేన్నపుడు అన్నం ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి వల్ల మనం తినలేక పోవచ్చు. ఎదురుగా అన్నం ఉంటది, ఆకలి వేస్తూంటాది కానీ తినలేని పరిస్థితి.  కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా అన్నము పై విసుగు, నిర్లక్ష్యం చూపరాదు. అన్నం  అన్న పూర్ణ దేవి..   ప్రత్యక్ష దేవత అని చెప్పవచ్చు. 

 ఎలాంటి పర్వదినం కాకుండా అలా అందరూ కోపంతో కటిక ఉపవాసం చేయడం కూడా దోషమేనని పెద్దలు చెబుతుంటారు. భోజనం చేస్తున్న వారిపై ఆవేశ పడడం వలన శాస్త్ర సంబంధమైన దోషాలతో పాటు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ వుంటాయి. అందువలన భోజన సమయంలో సాధ్యమైనంత వరకూ కోపతాపాలకు పోకుండా ఉండడమే అన్నివిధాలా మంచిదని చెప్పవచ్చు.భోజనం అనేది పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా చేసినప్పుడే వంటబడుతుంది. అందుకే హడావిడిపడకుండా ... మాట్లాడకుండా భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.