(Local) Mon, 17 Jun, 2019

అప్పికొండ.. అప్పుగా మిగిలిన శివలింగం

June 06, 2019,   11:00 PM IST
Share on:

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పికొండ ఆలయ విశేషాలు ఈ రోజు ఆలయం శీర్షికలో పరిశీలిద్దాం.

దక్షిణ భారతదేశంలో అతి పురాతన శైవ క్షేతాల్లో అప్పికొండ ఒకటి. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వెనుక సముద్ర తీరాన ఈ ఆలయం వెలిసింది. నిత్యం భక్తుల పూజలను అందుకునే ఈ శైవ క్షేత్రం ప్రాంగణలో అత్యంత పురాతన శివలింగాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయం నిర్మాణం వెనుక కథ పరిశీలిస్తే... కపిల మహార్షి ఈ పుణ్య క్షేత్రానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. విశ్వ ప్రదక్షిణలో భాగంగా ఈ తూర్పు తీరానికి వచ్చిన కపిల మహర్షి 101 శివలింగాలను ప్రతిష్టాంచాలని భావించారట. కానీ ఓ లింగం ఇంకా మిగిలి ఉండగానే సూర్యోదయం అయిందని దీంతో ఓ లింగం అప్పుతో ఈ ప్రాంతం అప్పుకొండగా ఏర్పినట్టు భక్తులు చెబుతుంటారు. కాల క్రమంలో అప్పుకొండ అప్పికొండగా మారిందని కథనం ప్రచారం ఉంది. కాగా సముద్ర అలల తాకిడితో చాలా కాలం ఈ ఆలయం ప్రాంగణం సముద్రపు ఇసుకలో కప్పి ఉండిపోయింది. ఆర్కియాలజీ విభాగం పరిశోధనల్లో గుర్తించడంతో రెండు దశాబ్ధాల క్రితం తవ్వకాల్లో అప్పికొండ బయటపడింది. ఇంకా చాలా శివలింగాలు ఆలయంపరిసరాల్లో సముద్రపు ఇసుక లో ఉన్నట్టు మత్య్సకారులు చెబుతుంటారు. కాగా ఇక్కడ పురాతన వినాయకుడితో పాటు భారీ నందీశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు.

స్వామిని దర్శించి నందీశ్వరుని చెవిలో కోరిన కోర్కెలు చెబితే ఇట్టే తీరుతాయని అక్కడి వారి నమ్మకం. శివరాత్రి సందర్భంగా వేల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. శివరాత్రి రెండు రోజులు పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు గాజువాక , అప్పికొండ మద్య నడుస్తాయి. శివరాత్రి రోజు అభిషేకాలతో పాటు తెల్లవార్లు అక్కడ జాగరణ చేసి ఉదయం సాగర స్నానం చేయడం భక్తుల ఆనవాయితీ. 

 నంది చెవిలో కోర్కె చెబితే...

ఇక్కడ శివలింగాలతో పాటు నందీశ్వరుడుని కూడా ప్రత్యేకంగా దర్శిస్తారు. ఈ భారీ నందీశ్వరుడి చెవిలో  కోర్కెలు చెబితే తీరుతాయని భక్తుల నమ్మకం. ఆలయం ప్రాంగణంలో మరో రెండు శివలింగాలతో కూడిన ఉపాలయాలు ఉన్నాయి. వేల సంవత్సరాల నాటి ఈ ఆలయాలు సముద్రపు ఇసుకలో కప్పబడి ఉండటంతో కొందరు శిధిలమయ్యాయి. కానీ ఆ నాటి శిల్ప కళ నైపుణ్యం మాత్రం చూడాల్సిందేనని పర్యాటకులు చెబుతుంటారు.

విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి గాజువాకకు ప్రతి నిత్యం సిటీ బస్సులు ఉంటాయి. అక్కడ నుంచి అప్పికొండకు ప్రత్యేక సర్వీసులు నిరంతరాయంగా నడుస్తుంటాయి. అలాగే విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి నేరుగా అప్పికొండుకు సిటీ సదుపాయం కూడా ఉంది.

                                 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.