(Local) Wed, 21 Aug, 2019

తెనాలి ఎవరిది ..రాష్ట్రం ఎవరిది

October 18, 2018,   9:44 PM IST
Share on:

ఎన్నో ఆసక్తికరమైన ఎన్నికల సమారాలను చూసిన తెనాలి నియోజకవర్గం ,ఈసారి కూడా
మరో రసవత్తర పోరుకు వేదికగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు
భావిస్తున్నారు.2004‍‍‍‍‍‍‍‍‍‍‍,2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించిన తెనాలి
ప్రజలు ఈసారి ఎవరిని అందలం ఎక్కిస్తారో అంతుపట్టకుండా వుంది. గడచినా రెండు
ఎన్నికలలో గెలిచినా నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ
బలహీనపడడం తో తన రాజకీయ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ లోకి చేరడంతో టీడీపీ
,వైస్సార్సీపీ జరుగుతుంది అనుకొన్న ద్విముఖపోరు ,ఇప్పుడు మూడు ముక్కలాటగా
మారిపోయింది .

మూడు ప్రధాన పార్టీలు నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన
అభ్యర్థులనే రంగంలోకి దింపుతుండడం కూడా వచ్చే ఎన్నికల పట్ల మరింత ఆసక్తిని
రేకిత్తిస్తున్నాయి.తెలుగు దేశం పార్టీ సిట్టింగ్ శాసనసభ్యుడు ఆలపాటి
రాజేంద్ర ప్రసాద్ ను బరిలోకి దింపుతుండగా వైస్సార్సీపీ అభ్యర్థిని ఇంకా ఖరారు
చెయ్యవలసి వుంది ,మరో వైపు జనసేన పార్టీ నుండి మాజీ స్పీకర్ మనోహర్ పోటీ
చెయ్యడం దద్దపు ఖాయంగా కనిపిస్తోంది . వైస్సార్సీపీ నుంచి అన్నాబత్తుని శివ
కుమార్ పోటీ చెయ్యాలని భావిస్తున్నప్పటికీ పార్టీ అధినాయకత్వం ఆయననే
బరిలోకి దింపుతుందా అన్న సందేహాలు శ్రేణులను పీడిస్తున్నాయి .

కాంగ్రెస్ కూడా ఈ నియోజకవర్గం లో సాంప్రదాయ వోట్ బ్యాంకు ఉండడం తో
బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది .కాగా ఈ ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని
నియోజకవర్గం లో తమ బలాబలాలను పరీక్షించుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా
పార్టీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని దింపే ప్రయత్నం
చేస్తోందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి . ఐతే NDA నుంచి తెలుగు దేశం
పార్టీ బయటకు రావడం, తదనంతరం బీజేపీ ని దోషిగా నిలబెట్టే ప్రచార మాధ్యమాల
ప్రయత్నంతో ఆ పార్టీ ప్రజల మనస్సులు ఎలా అక్కటుకుంటుంది అన్నది
ప్రశ్నార్థకమే .

చైతన్యవంతులైన తెనాలి ఓటర్లు ఎవరిని గెలిపిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో
అధికారం చేపడుతుందని రాజకీయ వర్గాలలో వున్నా నానుడి కూడా తెనాలి ఎన్నికల పై
పరిశీలకుల ద్రుష్టి పడడానికి మరో కారణం .ఇందువల్ల అటు పరిశీలకులు ,ఇటు రాజకీయ
నాయకులూ,పార్టీల తో బాటు ప్రజలు కూడా తెనాలి ఎన్నికలను నిశితంగా

గమనిస్తున్నారు.చివరాఖరికి తెనాలి లో ఎవరు గెలుస్తారో ఆంధ్ర రాష్ట్రం ఎవరి
ఏలుబడిలోకి వెళ్తుందో అన్న సంగతి మాత్రం ఎన్నికల వెండితెర పై చూడాలసిందే.

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.