(Local) Fri, 22 Nov, 2019

ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ఎవరిది

October 19, 2018,   12:19 AM IST
Share on:
ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ఎవరిది

కొప్పుల ఈశ్వర్ 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేడారం శాసనసభ నియోజకవర్గం నుంచి
పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తోనే ఆ పార్టీలో చేరి
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో టీఆర్ఎస్ అభ్యర్థిగా
మేడారం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర
సాధన కోసం తెలంగాణ ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపుమేరకు 2008లో తన
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా
గెలిచి తన సత్తా చాటుకున్నారు.
2009 శాసనసభ ఎన్నికలలో ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో
గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ 2010లో మళ్ళీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో సైతం గెలుపొందారు . అటు తరువాత 2014లో ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి ఐదోసారి
పోటీచేసి గెలిచారు .2015లో ప్రభుత్వ చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ ను నియమించారు కేసిఆర్. టిఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఈశ్వర్ కొనసాగుతున్నారు.ఈసారి 2018 ఎన్నికలలో ఆయన ధర్మపురి నుండి పోటీ కి సిద్ధం అయ్యారు . గత 14 ఏళ్ళనుండి చూస్తే ఈ నియోజకవర్గం లో ఇటు కాంగ్రెస్ గాని తెలుగు దేశం కానీ ఎవరు కూపీడ గట్టి పోటీని ఇవ్వలేకపోయారు ,మరి ఈసారి కొప్పుల ఈశ్వర్ ఈ నియోజకవర్గంలో గట్టిపోటీని ఎదురుకుంటున్నారో లేదో వేచి చూద్దాం ?.

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.