(Local) Mon, 22 Jul, 2019

వేడెక్కుతున్న 'అనంత' రాజకీయాలు

October 23, 2018,   12:08 AM IST
Share on:

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాతీయ,ప్రాంతీయ పార్టీలు వివిధ రూపాల్లో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాయి.కేంద్రంను,రాష్ట్రంలోను మారుతున్న రాజకీయ సమీకరణాలు,జాతీయ,స్థానిక పార్టీలు చేపడ్తున్న వివిధ కార్యక్రమాల ప్రభావంతో అనంతపురం జిల్లా రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి .ఫలితంగా అనంత జిల్లా రాజకీయ ముఖచిత్రం రాబోవు మూడు ,నాలుగు నెలల్లో మారబోతోంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకొనే క్రమంలో భాగంగా జిల్లాలో పాగా వేసేందుకు బీజేపి కసరత్తు మొదలు పెట్టింది.ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ జిలాల్లో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.మరోవైపు రాష్ట్ర విభజనతో అడ్రెస్స్ గల్లంతైన కాంగ్రెస్ రాబోయే ఎన్నికలలో తన ఉనికి చాటుకోడానికి పాత నేతల్ని,జిల్లా నాయకుల్ని కలుపుకునేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది.పిసిపి చీఫ్ ఎన్.రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా వాసి కావడంతో ముందుగా ఆ జిల్లాలోని పార్టీ విడిన నేతలను సమీకరించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతలో 'వంచన పై నిరసన' దీక్ష చేపట్టింది.టీడిపి నవ నిర్మాణ దీక్ష ,ఏరువాక ,ఇంటింటికి టిడిపి వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ అభివృద్ధి ,సంక్షేమ పథకాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తోంది.కడప ఉక్కు..ఆంధ్రుల హక్కు పేరుతో చెప్పటిన ఆమరణ నిరాహారదీక్షల ప్రభావం కూడా అనంత పై పడింది .ఇంక జనసేన అధినేత పవన్ ఈ నెలాఖరులోపు జిల్లాలో పర్యటించి జేఎన్టీయూలో విధ్యార్థులు,మేధావులతో బహిరంగసభ నిర్వహించేందుకు  ప్రణాళికను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
అన్ని పార్టీలు కూడా బీసి,ఎస్సీ,మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటినుంచే ఎత్తుగడలు,వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు అనంత పై ప్రభావం చూపుతుండటంతో పార్టీల పొత్తులు,టికెట్ల కేటాయింపు విషయంలో స్పష్టత కోసం టీడీపీ,వైకాపా,బీజేపీ పార్టీల నేతలు అధిష్టాన నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలలో అనంత రాజకీయాలను శాసించేది ఎవరో కాలమే నిర్ణయించాలి .

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.