(Local) Mon, 26 Aug, 2019

డాలర్‌తో పోలిస్తే ఒక్క రోజే 54 పైసలు పతనం

August 03, 2019,   10:38 AM IST
Share on:

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం మరింత పతనమైంది. రూపాయి విలువ అత్యంతగా 54 పైసలు పతనమైంది. ఆఖరికి డాలర్‌పై రూపాయి విలువ 69.60 వద్ద ముగిసింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 69.26 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి తదుపరి మరింత తిరోగమించింది. తర్వాత మరింతగా పతనమైంది. దీంతో మే రెండో వారం తర్వాత మళ్లీ కనిష్టానికి చేరింది.

వాణిజ్య వివాద పరిష్కారానికి చైనా నేత జిన్‌పింగ్ వేగంగా స్పందించడం లేదంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే నెల నుంచి 300 బిలియన్ డాలర్ల చైనీస్ దిగుమతులపై 10 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ స్పందించకపోతే టారిఫ్‌లను మరింత పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో యూరో, యెన్ వంటి ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడినప్పటికీ బంగారానికి డిమాండ్ పెరిగింది.

మరోపక్క స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్తువెత్తాయి. ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న ఎఫ్‌పిఐలు గత నాలుగు రోజుల్లో నగదు విభాగంలో రూ. 3900 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గురువారం రూపాయి 27 పైసలు క్షీణించి 69.06 వద్ద స్థిరపడింది. ఇది ఐదు వారాల కనిష్టస్థాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించడంతో డాలరు జోరందుకుంది. ఇకపై రేట్ల కోత ఉండబోదని సంకేతాలు ఇవ్వడంతో యూరో, జపనీస్ యెన్ తదితర ప్రధాన కరెన్సీలతో మారకంలో బుధవారం డాలరు ఇండెక్స్ రెండేళ్ల గరిష్టం 98.85ను తాకింది. దీంతో దేశీయంగానూ రూపాయికి దెబ్బ తగిలింది.

సంబంధిత వర్గం

మొదటి టెస్ట్ లో భారత్ ఘన విజయం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.