(Local) Wed, 08 Jul, 2020

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నుండి మూడు కీలక షేర్లు ఔట్

November 23, 2019,   3:55 PM IST
Share on:
బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నుండి  మూడు కీలక షేర్లు  ...

డిసెంబర్‌ 23న మూడు కీలక షేర్లు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ నుంచి బయటకు వెళ్లిపోనున్నాయి. యస్‌ బ్యాంక్‌, టాటామోటార్స్‌, వేదాంతా షేర్లను తొలగించి వీటి స్థానంలో నెస్లే ఇండియా, టైటాన్‌, అల్ట్రాటెక్‌ షేర్లను చేర్చనున్నారు. అంతేకాకుండా వీటిని ఆసియా సూచీలో కూడా చేర్చనున్నారు. మరోవైపు బిఎస్‌ఈ సెన్సెక్స్‌ 50 సూచీ నుంచి యస్‌ బ్యాంక్‌ ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ను తప్పించి వాటి స్థానంలో యూపిఎల్‌, డాబర్‌ ఇండియాను చేర్చనుంది. కాగా ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌ , ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌, ఇన్ఫోఎడ్జ్‌ ఇండియా,ఎస్‌బిఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌లకు బిఎస్‌ఈ నెక్ట్స్‌50 సూచీలో స్థానం లభించగా.. డాబర్‌ ఇండియా, కాడిలా హెల్త్‌కేర్‌, యూపిఎల్‌,ఎడల్వైజ్‌ ఫైనాన్స్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మాలను తప్పించనున్నారు. ఆసియా ఇండెక్స్‌ ఈ మార్పులను డిసెంబర్‌ 23నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.