(Local) Wed, 24 Jul, 2019

ఎస్ బి ఐ ఖాతాదారులకు కొత్త నిబంధన

June 28, 2019,   3:14 PM IST
Share on:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు కొత్త నిబంధనలు పెట్టింది. ఇక నుంచి ఏటీఎం కార్డు వాడిన ప్రతీ ఖాతాదారుడి దగ్గరి నుంచి సంవత్సరానికి రూ.125 కట్టాలని పేర్కొంది. అలాగే కార్డు మార్చుకునేందుకు రూ.300లు కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ లావాదేవీలు, ఏటీఎం కార్డు ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే వారికి పరిమితులు విధించింది. ఇప్పటి నుంచి ఎస్‌బీఐ ఖాతాదారులు తమ ఏటీఎం కార్డుల నుంచి రోజుకు రూ. 40,000 మాత్రమే తీసుకోవాలని సూచించింది. అలాగే ఆన్‌లైన్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ 75,000 మాత్రమేనని స్పష్టం చేసింది.

ఒకవేళ పరిమితికి మించి ఎక్కువసార్లు నగదు తీసుకున్నట్లైతే అదనపు చార్జీలు వసూలు చేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.మారుతున్న కాలానికి అనుగణంగా ఎస్‌బీఐ మరిన్ని కొత్త సర్వీసులను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. పిన్ నెంబర్ మార్పు, చెక్ బుక్ కోసం దరఖాస్తు, బిల్లుల చెల్లింపు, ఐఎంపీఎస్ రిజిస్ట్రేషన్, మొబైల్ ఫోన్లకు రీచార్జ్‌ వంటి సర్వీసులును ఎస్‌బీఐ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

   

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.