(Local) Sat, 31 Oct, 2020

నెట్ వర్క్ 18లో వాటాలపై సోని కంపెనీ ఆసక్తి

November 21, 2019,   6:15 PM IST
Share on:
నెట్ వర్క్ 18లో వాటాలపై సోని కంపెనీ ఆసక్తి

నెట్ వర్క్ 18లో వాటాలు కొనుగోలు చేసేందుకు సోని కంపెనీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రాథమికంగా చర్చలు జరిపి పలు డీల్స్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోని కంపెనీ తన భారతీయ వ్యాపారాన్ని విస్తరిస్తోందని తెలియడంతో గురువారం నెట్ వర్క్ 18 షేర్లు దాదాపు 15శాతానికి పైగా ఎగిసాయి. మరోవైపు టీవీ 18 బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ షేర్లు కూడా 9.7శాతం పెరిగాయి. నెట్ ఫ్లిక్స్ వంటి వాటిని ఎదుర్కోవడానికి సోనీకి ఈ డీల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే సమయంలో అంతర్జాతీయ కంటెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి నెట్ వర్క్ 18కు మంచి అవకాశం లభిస్తుంది. అన్ని అంశాలను మా కంపెనీ పరిశీలిస్తోందని రిలయన్స్ ప్రతినిధి మీడియాకు తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.