(Local) Wed, 21 Aug, 2019

రెండో రోజు కూడా లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు....

August 09, 2019,   7:01 PM IST
Share on:

వరుసగా రెండో రోజు దలాల్‌స్ట్రీట్‌ లాభాలతో కళకళలాడింది. ఈరోజు కూడా దేశీయ మార్కెట్లు లాభాల్లో పరుగులు తీశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 11,100 పైకి చేరింది. బ్యాంకింగ్‌, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్ల అండతో సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. నిఫ్టీ కూడా లాభాలతో మొదలైంది. మధ్యాహ్నం సమయంలో మరింత దూసుకెళ్లిన సెన్సెక్స్‌ ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడపంతో రోజు గరిష్ఠాల నుంచి సూచీలు వెనక్కి వచ్చాయి. నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ 254 పాయింట్లు ఎగబాకి 37,582 వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 11,110 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ గా కొనసాగుతోంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.