(Local) Mon, 16 Sep, 2019

డెబిట్ కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు

August 20, 2019,   3:34 PM IST
Views: 122
Share on:
డెబిట్ కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు

బ్యాంకింగ్ వ్యవస్థలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ చెప్పారు. రాబోయే రోజుల్లో డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...యోనో డిజిటల్ సేవల ద్వారా కార్డు లేకుండానే క్యాష్ డ్రా చేసి కార్డుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం 93 కోట్ల ఎస్‌బీఐ డెబిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయని వాటి స్థానంలో యోనో యాప్ ద్వారా సేవలను అందించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. మరో ఐదేళ్లలో ఇది సాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 68 వేలుగా ఉన్న యోనో కేంద్రాల సంఖ్యను మరో ఏడాదిన్నరలో పది లక్షలకు చేరుస్తామన్నారు. ఇక నుంచి కార్డుల వినియోగం ఉండదని చెప్పారు.

సంబంధిత వర్గం
ఎస్ బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్
ఎస్ బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప ...
ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.