(Local) Sat, 31 Oct, 2020

ఎయిర్‌టెల్‌,వొడాఐడియా చార్జీల పెంపు ...

November 19, 2019,   6:59 PM IST
Share on:
ఎయిర్‌టెల్‌,వొడాఐడియా చార్జీల పెంపు ...

అన్నీ ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి రిలయన్స్ జియో... మరోవైపు టెలికం రంగంలోకి ఇతర సంస్థలకు జియోను ఎదుర్కొని నిలడడం సవాల్‌గా మారింది. ఇటీవలే వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలు భారీ స్థాయిలో నష్టాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా వ్యాపారం లాభదాయకంగా మార్చుకునేందుకు ధరలను పెంచుతున్నట్లుగా ఈ కంపెనీలు పేర్కొన్నాయి. అయితే ఈ చార్జీలను డిసెంబరు ఒకటో తేది నుంచి పెంచనున్నట్లు ముందుగా వొడాఫోన్‌ ఐడియా వెల్లడించింది. తమ కస్టమర్లు ప్రపంచస్థాయి డిజిటల్‌ అనుభూతిని ఆస్వాదించేందుకు ప్రయత్నాలు చేస్తామని, అందుకు అనుగుణంగా తమ టారీఫ్‌ను పెంచుతున్నామని వొడా ఐడియా ప్రకటించింది. అయితే వొడాఫోన్‌ ఐడియా ప్రకటించిన కొంత సమయానికే భారతీ ఎయిర్‌టెల్‌ కూడా తమ చార్జీలను డిసెంబర్‌ నుంచి పెంచనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ధరలు పెంచుతామని మాత్రమే ఈ కంపెనీలు ప్రకటించాయి కానీ వాటి ధరలను ఏ మేరకు పెంచుతారనేది మాత్రం ఈ రెండు కంపెనీలు వెల్లడించలేదు.

సంబంధిత వర్గం
టారిఫ్ పెంచుతామంటున్న జియో...
టారిఫ్ పెంచుతామంటున్న జియో...
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్‌టెల్‌
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్‌టెల్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.