(Local) Mon, 26 Aug, 2019

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు

July 30, 2019,   11:32 AM IST
Share on:

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్.. తన ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలు రచింస్తోంది. ఇందులో భాగంగా ఇకపై తన అధికారులు విమానాల్లో కేవలం ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులందరినీ కార్యాలయ ఉత్తర్వు ప్రకారం దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలలో ఎకానమీ క్లాస్ ద్వారా   మాత్రమే ప్రయాణించాలని కోరింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ ముందస్తు అనుమతితో,  అధికారులు వ్యాపార అవసరాల విషయంలో ఉన్నత తరగతిలో  ప్రయాణించవచ్చని  పేర్కొంది. మార్కెట్లో పోటీని తట్టుకోలేక పోతున్న బీఎస్ఎన్ఎల్  2015-16లో రూ. 4,859 కోట్లు, 2016-17లో రూ .4,793 కోట్ల నష్టాలను చవిచూసింది. గట్టెక్కించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన వస్తే తప్పా బీఎస్ఎన్ఎల్ మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.