(Local) Wed, 24 Jul, 2019

ఐసిఐసిఐ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత

July 02, 2019,   2:03 PM IST
Share on:

ప్రైవేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ రుణాలు ఇక చౌక కానున్నాయి. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 0.10 శాతం మేరకు తగ్గించినట్టు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. దీంతో వడ్డీ రేటు 8.65 శాతానికి దిగిరానుంది. డిపాజిట్ రేట్లపై వడ్డీని తగ్గించిన కొన్ని వారాలకే ఈ నిర్ణయం తీసుకొంది. ఆర్‌బిఐ ఆదేశాల మేరకు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లలో కోత విధించింది. కొత్త రుణ రేట్ల ప్రకారం గృహ మార్టిగేజ్, ఆటో రుణాలపై వడ్డీరేట్లు 8.65 శాతం కానున్నాయి. ఇటీవల ప్రైవేటు రంగ బ్యాంకులైన ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటివి జూన్‌లో కొన్నిరకాల డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.10 శాతం నుంచి 0.25శాతం వరకు తగ్గించాయి. జూన్ 6న నిర్వహించిన ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించి, ఈ ప్రయోజనాలను బ్యాంకులు కస్టమర్లకు బదిలీ చేయాలని సూచించింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.