(Local) Sun, 17 Oct, 2021

బంగారం ధరకు రెక్కలు...

August 06, 2019,   1:04 PM IST
Share on:
బంగారం ధరకు రెక్కలు...

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి మేలిమి బంగారం (999 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.37,000 పైనే కదలాడుతోంది. ఈ ధరల ఆధారంగానే ఆభరణాల విపణిలోనూ అమ్మకాలు జరుగుతాయి కనుక, దేశీయంగా కొనుగోలుదారులకు చుక్కలు కనపడుతున్నాయి. ఇదే సమయంలో యూఎస్ లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించిన తరువాత పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న ఈక్విటీల అమ్మకాలవైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరాయి. భారత మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 800 పెరిగి రూ. 36,970కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1000 పెరిగి రూ. 43,100కు చేరుకుంది. డాలర్ తో రూపాయి మారకపు విలువ బలహీనపడటం కూడా బంగారం ధరను పెంచిందని బులియన్ పండితులు వ్యాఖ్యానించారు.

సంబంధిత వర్గం
బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం
బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.